Cessation of anxiety:ఆదిలాబాద్ లో సద్దుమణిగిన అన్నదాతల ఆందోళన

by Sridhar Babu |
Cessation of anxiety:ఆదిలాబాద్ లో సద్దుమణిగిన అన్నదాతల ఆందోళన
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్ల (Purchases of cotton)విషయంలో తేమ శాతం నిబంధన వద్దని, మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు సద్దుమణిగింది (Cessation of anxiety). అధికారులు వ్యాపారస్తులతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం మొదటి రోజు మార్కెట్ యార్డ్ కు వచ్చిన పత్తిని నిబంధనలు లేకుండా కొనుగోలు చేసేందుకు సమ్మతించడంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు. మొదటి రోజు పత్తి కొనుగోళ్లు మార్కెట్ యార్డ్ లో నిలిచిపోవడంతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సీసీఐ అధికారులతో పాటు పత్తి వ్యాపారస్తులతో చర్చించారు.

దీంతో రాత్రి 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ చొరవతో వ్యాపారస్తులు Rs.6700 మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో మొదటి రోజు మార్కెట్ కు వచ్చిన పత్తిని శనివారం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయనున్నారు. కాగా సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, Rs.7521 మద్దతు ధరతో 8% తేమశాతం వరకు కొనుగోలు చేస్తారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. శనివారం కొత్తగా రైతులు తమ పత్తిని మార్కెట్​కు తీసుకురావద్దని కోరారు. వ్యాపారస్తులతో చర్చలు జరిపిన వారిలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ (Collector, District SP)తో పాటు అదనపు కలెక్టర్, డీఎస్పీ, సంయుక్త సంచాలకులు వరంగల్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఉన్నత శ్రేణి కార్యదర్శి, రైతు నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed