- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి ఇంటికి ఎవ్వరు వెళ్లొద్దు.. ఎవ్వరు మాట్లాడొద్దు..
దిశ, కాసిపేట : కుల బహిష్కరణ చేసిన సంఘటన మండలంలోని దుబ్బగూడెంలో జరిగింది. దుబ్బగూడెం గ్రామానికి దుర్గం సంపత్ వ్యక్తి గత సమస్యలపై కుల పెద్దల వద్దకు కాకుండా, పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారనే కోపంతో సంపత్ కుటుంబాన్ని కులబహిష్కరణ చేశారు. సంపత్ కుటుంబంతో ఎవ్వరూ మాట్లాడొద్దని, వారి ఇంటికి ఎవ్వరు వెళ్ళొద్దని, వారిని ఎవ్వరు ఇంటికి రానివ్వదని హుకుం జారీ చేశారు. వారి ఇంటికి వెళ్లిన, మాట్లాడిన వారిని సైతం కుల బహిష్కరణ చేస్తామని బెదిరింపులు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కుల బహిష్కరణ చేయడంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. బాధిత కుటుంబాన్ని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్రఅధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, సారయ్య, ధూట రాజు, శ్రీనివాస్, కిరణ్ లు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో కూడా కుల బహిష్కరణ అనేది హేయమైన చర్య అని, దీని పై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.