- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తృటిలో తప్పిన ప్రమాదం..బస్సును ఢీ కొన్న ట్రాక్టర్
దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలోని బంధం క్రాసింగ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుండి నిర్మల్ వెళ్తున్న (TS 01 UA 3786 ) బస్సును కేఎన్ఆర్ సంస్థ వాహనం (ట్రాక్టర్ తో కూడిన వాటర్ ట్యాంకర్) ఢీ కొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ జి.అనిల్ (25) బస్సులోని ప్రయాణికులు ఇందిరమ్మ (60), రమేష్ (30) వీరిని చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్టర్ బ్రేకులు పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.
ప్రమాద స్థలంలోని వాహనాన్ని కేఎన్ఆర్ సంస్థ సిబ్బంది సంస్థ ప్రాంగణానికి తరలించడానికి గల కారణాల వెనుక ఉన్న అంతరాయం ఏమిటో ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానిక కేఎన్ఆర్ సంస్థలో మరుగున పడ్డవాహనాల ఉపయోగాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. మెయింటెనెన్స్ లేని వాహనాలను వినియోగిస్తున్నా కూడా సంబంధిత అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సరైన స్థితిలో లేని వాహనాలు వాడడం వలన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.