- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలి'
దిశ, ఇచ్చోడ : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలందరూ తరిమికొట్టాలని బీజేపీ బోథ్ అసెంబ్లీ ప్రబారి కొంగ సత్యనారాయణ అన్నారు. ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్రలో భాగంగా సోమవారం స్థానిక పార్టీకార్యాలయంలో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్నిమోసం చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు.
కుటుంబ మోసపూరిత పాలనను అంతమొందించి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రజలకు తెలిసే విధంగా ప్రతీ ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్, జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి భీమ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్, బోథ్ అసెంబ్లీ ఇంచార్జీ సూర్యకాంత్ గిత్తె, మండల అధ్యక్షులు కేంద్రేనారాయణ, శక్తి కేంద్రం ఇంచార్జీ సంతోష్ పవర్, నాయకులు ఆద్య సుధాకర, మల్లేష్, రాము, ముండే నానాజీ, టేహర్ రమేష్, పెరుమల్ల పోశెట్టి, రవి, అనిల్ మూర్కుటే, మచ్చ అజయ్, శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.