Nampally Court: సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్

by srinivas |   ( Updated:2024-11-05 16:17:31.0  )
Nampally Court: సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్
X

దిశ, వెబ్ డెస్క్: మద్దెల చెరువు సూరి(Maddela Cheruvu Suri) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు భానుకిరణ్‌(Accused Bhanu Kiran)కు నాంపల్లి కోర్టు(Nampally Court) బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసు(CID Arms Act Case)ల్లో ఆయనకు బెయిల్ ఇస్తూ ఆదేశించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్‌కు కోర్టు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో 12 సంవత్సరాలుగా చంచల్ గూడ జైలు(Chanchal Guda Jail)లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక జీవిత ఖైదుకు సంబంధించిన కేసు విచారణను నాంపల్లి కోర్టు ధర్మాసనం ‌ఈ నెల 14న విచారించనుంది. ఇక భాను జీవితఖైదుపై ఇప్పటికే సుప్రీం, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 12 ఏళ్లుగా జైల్లో ఉంటున్నానని, ఇప్పటికే ఎంతో శిక్ష అనుభవించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాగా 2011 జనవరి 4న మద్దెల సూరి హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సనత్ నగర్ నవోదయ కాలనీలో సూరిని భాను కిరణ్ గన్‌తో కాల్చి చంపేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు 2018 డిసెంబర్‌లో భాను కిరణ్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే నాంపల్లి కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ భాను కిరణ్ అప్పట్లోనే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నాంపల్లి కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో చంచల్ గూడ జైలులో భాను కిరణ్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 12 ఏళ్లుగా జైలులోనే మగ్గుతున్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో తాజాగా భాను కిరణ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసుల్లో భాను కిరణ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story