ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

by Johnkora |
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
X

- గోపాలకృష్ణన్‌తో పాటు ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంపై కేసు

- ఎఫ్ఐఆర్‌లో మరో 16 మంది నిందితులు

దిశ, నేషనల్ బ్యూరో:

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) మాజీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మందిపై బెంగళూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బెంగళూరు సిటీ 71వ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఐఐఎస్సీకి చెందిన సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీ మాజీ ఫ్యాకల్టీ దుర్గప్ప ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. 2014లో తనపై తప్పుగా హనీ ట్రాప్ కేసులో ఇరికించారని, దీని వల్ల తాను ఇన్‌స్టిట్యూట్ నుంచి డిస్మిస్ చేయబడ్డానని దుర్గప్ప ఫిర్యాదు చేశాడు. దుర్గప్ప గిరిజన తెగ బోవి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. కాగా, గోపాలకృష్ణన్‌తో పాటు ఐసీఎస్సీ బోర్డ్ మెంబర్, మరి కొంత మంది ఫ్యాకల్టీ కలసి తన ఉద్యోగం పోవడానికి కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దుర్గప్ప పేర్కొన్న వారిలో విద్యావేత్తలు గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంధ్యా విశ్వేశ్వరయ్య వంటి ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ కేసులపై గోపాలకృష్ణన్ ఇంకా స్పందించలేదు. ఐఐఎస్సీలోని సీనియర్ విద్యావేత్తలు, అడ్మినిస్ట్రేటర్స్ తమ అధికారాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ కేసుతో బహిర్గతం అయ్యింది. తన పదవిని, విశ్వసనీయతను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని దుర్గప్ప ఆరోపిస్తున్నారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed