అమానుష ఘటన.. కొడుకుపై తండ్రి విచక్షణారహితంగా దాడి

by D.Reddy |   ( Updated:2025-02-02 03:29:57.0  )
అమానుష ఘటన.. కొడుకుపై తండ్రి విచక్షణారహితంగా దాడి
X

దిశ, వెబ్ డెస్క్: కంటిరెప్పాలా కాపాడాల్సిన తల్లిదండ్రులే కర్కశకులయ్యారు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. రక్తం వచ్చేలా కొడుతూ తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానుష ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. జంగారెడ్డిగూడెంకు చెందిన శశి, పవన్ భార్యాభర్తలు. వీరికి రాహుల్ అనే కొడుకు ఉన్నాడు. అయితే రాహుల్‌కు పవన్ మారు తండ్రి. ఈ క్రమంలో గత కొంత కాలంగా రాహుల్‌పై పవన్ విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నాడు. కన్నతల్లి శశి ముందే ఛార్జర్ వైరుతో కొట్టడంతో బాలుడు తీవ్ర గాయపడ్డాడు. కొట్టిన తర్వాత గాయాలపై పవన్ కారం చల్లాడు. గమనించిన స్థానికులు రాహుల్‌ను ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. గత కొంత కాలంగా బాలుడిని తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు.


Next Story

Most Viewed