మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఈ సారి బొమ్మ బ్లాకు బస్టరే అంటున్న ఫ్యాన్స్

by Kavitha |
మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఈ సారి బొమ్మ బ్లాకు బస్టరే అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. 69 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు. ఇక రీసెంట్‌గా చిరుకి పద్మ విభూషణ్(Padma Vibhushan) అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’(Valtheru Veeraiah) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇక ఇందులో మాస్ మహారాజా రవితేజ(Raviteja) కూడా కనిపించడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ బాబీ కాంబో మళ్లీ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ (Vishwambhara) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో ఓ సినిమా చేస్తున్నాడు.

కాగా దీనిని నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత స్టార్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు తర్వాత మెగాస్టార్ బాబీ కొల్లితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించనుందట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

కాగా డైరెక్టర్ బాబీ కొల్లి రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ(Balakrishna)తో ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(shraddha Srinath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే కలెక్షన్ల విషయంలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది.


Next Story

Most Viewed