- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అర్ధరాత్రి తల్వార్‌తో అఘోరీ హల్‌చల్.. ఉలిక్కి పడ్డ జనం (వీడియో)

దిశ, సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా మారు మోగిపోతున్న పేరు అఘోరి మాత. తాను సనాతన ధర్మం కోసం వచ్చానని అఘోరి మాత చెప్పుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ప్రత్యక్షమైంది. గ్రామస్తులకు అఘోరికి రాత్రి కొట్లాట చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఉండ్రుగొండ గ్రామస్తులు ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి గ్రామానికి వెళుతుండగా ఎన్ హెచ్ 65 జాతీయ రహదారి ఉండ్రుగొండ ఆర్చి వద్ద వారికి అఘోరి కనిపించింది. వాహనాలను పక్కకు ఆపీ ఆమెను తిలకించి ఫోటోలు, వీడియోలు తీస్తున్న సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన అఘోరి కార్ లో ఉన్న తల్వారు( కత్తి)ని తీసుకొని వారి వెంట పడింది.
ఆగ్రహించిన గ్రామస్తులు పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఆమెను కొట్టినట్టు సమాచారం. అలాగే తల్వార్(కత్తి)తో ఓ గ్రామస్తుడి కాలు మీద అఘోరి కొట్టినట్టు వారు తెలిపారు. దీంతో అక్కడి నుండి గ్రామస్తులు పారిపోయారు. కానీ అర్ధరాత్రి సమయంలో నాకు క్షమాపణలు చెప్తేనే ఈ గ్రామం నుంచి వెళ్తానని, కత్తి తీసుకొని ఉండ్రుగొండ గ్రామంలోకి అఘోరి ప్రవేశించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామంలోకి వెళ్లి అఘోరి మాతకు నచ్చజెప్పి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో అక్కడి నుంచి పంపించారు. అక్కడి నుండి వెళ్లిపోయిన అఘోరి మాత ఎన్ హెచ్ 65 జాతీయ రహదారి ఖాసీంపేట అడ్డ రోడ్డు వద్ద మళ్లీ ప్రత్యక్షమైంది. అక్కడున్న యువకులతో కూడా వాగ్వాదానికి దిగిందని సమాచారం.