- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
Political party: 83 శాతం పెరిగిన బీజేపీ ఆదాయం.. వార్షిక ఆడిట్ రిలీజ్ చేసిన ఈసీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని రాజకీయ పార్టీలకు సంబంధించిన వార్షిక ఆడిట్ నివేదికను భారత ఎన్నికల సంఘం (Election commission) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వార్షిక ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గతేడాది కాలంలో బీజేపీ ఇన్‌కమ్ 83 శాతం పెరిగింది. 2022-23లో రూ. 2360.8 కోట్ల నుంచి 2023-24 నాటికి రూ. 4340.5 కోట్లకు పెరిగింది. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1685.6 కోట్లు వచ్చాయి. ఆ పార్టీ వద్ద 2024 మార్చి 31 నాటికి రూ. వద్ద రూ. 7,113.80 కోట్ల నగదు ఉండగా దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా ఉంది. ఎన్నికల కమిషన్‌కు అందించిన డేటా ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వరకు 2023-24లో బీజేపీ రూ. 1,754.06 కోట్లు ఖర్చు చేసింది. ఇది 2022-23లో ఖర్చు చేసిన రూ. 1,092 కోట్ల కంటే 60 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
రూ.619.67 కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్
అదే సమయంలో కాంగ్రెస్ ఆదాయం 170 శాతం పెరిగి రూ.1225 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఆ పార్టీ వద్ద రూ. 857.15 కోట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 2022-23లో రూ.192.56 కోట్లు ఖర్చు చేయగా.. 2023-24లో రూ.619.67 కోట్లు ఖర్చు చేసినట్టు ఈసీ తెలిపింది. విమానాల కోసం రూ. 62.65 కోట్లు ఖర్చు చేయగా అభ్యర్థులకు రూ. 238.55 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఇక, ఎలక్ట్రానిక్ మీడియాపై రూ.207.94 కోట్లు, ప్రింట్ మీడియాపై రూ.43.73 కోట్లు ఖర్చు చేసింది. బాండ్ల ద్వారా అత్యధిక ఆదాయం పొందిన పార్టీల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. ఎలక్ట్రానిక్ బాండ్ల ద్వారా రూ.828.36 కోట్లు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.
టీఎంసీ ఆదాయం హైక్
మమతా బెనర్జీకి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆదాయం కూడా పెరిగింది. గత ఏడాదిలో టీఎంసీ ఆదాయం రూ.646.39 కోట్లకు చేరుకోగా, అంతకుముందు రూ.333.46 కోట్లుగా ఉంది. టీఎంసీ తన ఆదాయంలో దాదాపు 95శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందింది. 2023-24లో మొత్తం ఆదాయం రూ.685.5 కోట్లుగా ప్రకటించిన బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ అధిగమించింది. మరోవైపు ఆరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆదాయం క్షీణించింది. 2022-23లో ఆ పార్టీ వద్ద రూ. 85 కోట్లు ఉండగా.. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 22 కోట్లకు తగ్గింది. అంతేగాక చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్న మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వార్షికాదాయం 2024లో గణనీయంగా పెరిగింది. 2022-23లో బీఎస్పీ ఆదాయం రూ.29 కోట్లు కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.64 కోట్లకు పెరిగడం గమనార్హం.
బీజేపీ ప్రకటనలకే రూ.1195 కోట్లు
బీజేపీకి స్వచ్ఛంద విరాళాలుగా మొత్తం రూ.3967 కోట్లు అందుకుంది. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1685.6 కోట్లు, జీవితకాల సహాయ నిధి నుంచి రూ.236.3 కోట్లు, ఇతర వనరుల నుంచి రూ.20242.7 కోట్లు వచ్చాయి. వ్యక్తిగత దాతలు దాదాపు రూ.240 కోట్లు, కార్పొరేట్ సంస్థలు రూ.1890 కోట్లు, సంస్థలు, సంక్షేమ సంస్థలు రూ.101.2 కోట్లు, ఇతరులు రూ.50 కోట్లు అందించారు. పార్టీ ప్రకటనలు, ప్రచారానికి రూ.1195 కోట్లు, ప్రయాణాలకు రూ.196.8 కోట్లు, అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా రూ.191 కోట్లు ఖర్చు చేసింది.