- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
INC: బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: గద్దర్(Gaddar) పై బండి సంజయ్(bandi Sanjay) వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేత సరిత తిరుపతయ్య(Congress Leader Saritha Thirupathaiah) డిమాండ్ చేశారు. గద్దర్ కు పద్మ అవార్డు(Padma Awards) ఇవ్వకపోవడంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ పై కేంద్రమంత్రి వ్యాఖ్యలు తగదని, బీజేపీ భావజాలం ఉన్నవారికి, ఆ పార్టీ నేతలకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
అంతేగాక ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. కేంద్రమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, బండి సంజయ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం క్షమించదని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఈటల రాబోతున్నాడనీ, తన ప్రాధాన్యత తగ్గిపోతుందని సంజయ్ ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నాడని సరిత ఆరోపించారు. అలాగే పద్మ అవార్డు గద్దర్ కి అలంకారం కాదు.. పద్మ అవార్డుకే గద్దర్ అలంకారం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉన్నంత వరకు గద్దర్ పాట వినిపిస్తుందని, ఎవరు అవునన్నా కాదన్నా ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు చరిత్రలో చిరస్మరణీయమని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు.
కాగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో రాజకీయ రగఢ కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. గద్దర్ కు పద్మ అవార్డు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. గద్దర్ నక్సలైట్లతో కూడి బీజేపీ కార్యకర్తలను చంపించాడని, అలాంటి వారికి అవార్డులు ఎలా ఇస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ లీడర్లు స్పందిస్తూ.. బండి సంజయ్ పై ఫైర్ అవుతున్నారు. బీజేపీ భావజాలం ఉన్న వారికే అవార్డులు ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.