Case registered నార్కోటిక్‌ కేసులో రాజ్‌పాకాల, విజయ్ మద్దూరిపై కేసు నమోదు

by Mahesh |
Case registered నార్కోటిక్‌ కేసులో రాజ్‌పాకాల, విజయ్ మద్దూరిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి జన్వాడ (Janwada)లోని ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫామ్ హౌస్ లో ఆయన బామ్మర్ది రాజ్ పాకాల)(Rajpakala) ఈ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కలిసి రైడ్ నిర్వహించారు. అనంతరం పార్టీలో విదేశీ మద్యంతో పట్టుబడటంతో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రాజ్‌ పాకాల నివాసం ఉంటున్న విల్లాకు పోలీసులు చెకింగ్స్ కోసం వెళ్లగా రాజ్ పాకాల తన నివాలంలో కనిపంచలేదు. దీంతో విజయ్‌ మద్దూరి (Vijay Madduri) విల్లాలో ఉన్నట్లు ఆనుమానించిన పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS workers) అడ్డుపడ్డారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా వస్తారని నిలదీశారు. అనంతరం పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు.. అడ్వకేట్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. అనంతపురం లోనికి వెళ్లిన అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ నార్కోటిక్‌ కేసు(Narcotic case)లో రాజ్‌పాకాల, విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా రాజ్‌ పాకాల, ఏ2గా విజయ్‌ మద్దూరిపై మోకిల పోలీస్ స్టేషన్(Mokila Police Station)లో కేసు నమోదైందని, ఎస్సై కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed