శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 8 విమానాలు రద్దు

by Mahesh |
శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 8 విమానాలు రద్దు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన.. రావాల్సిన 8 విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్- వైజాగ్, హైదరాబాద్- మైసూర్, చెన్నై- హైదరాబాద్, తిరుపతి-హైదరాబాద్, బెంగళూరు-హైదరాబాద్, చెన్నై- హైదరాబాద్ సర్వీసులు రద్దు అయిన వాటిలో ఉన్నాయి. ఆపరేషనల్ కారణాలతో వీటిని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమాన సర్వీసులను రద్దు చెయ్యటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో టికెట్ డబ్బులు వాపస్ చేస్తామని అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed