BREAKING: తెలంగాణలో 71.07 శాతం పోలింగ్.. ప్రకటించిన సీఈవో వికాస్ రాజ్

by Satheesh |   ( Updated:2023-12-01 10:40:43.0  )
BREAKING: తెలంగాణలో 71.07 శాతం పోలింగ్.. ప్రకటించిన సీఈవో వికాస్ రాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సగటున 71.07 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 2018లో 73.37 శాతం పోలింగ్ నమోదు కాగా.. అది ఈ సారి 2శాతం తగ్గిందన్నారు. గురువారం పోలింగ్ ముగియగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ రీ పోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా భువనగిరిలో 90.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు. డిసెంబర్ 3వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ముమ్మురంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుందని పేర్కొన్నారు. కాగా, గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు సాగింది. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ ముగిసే వరకు రాత్రి అయ్యింది. ఈ నేపథ్యంలో అన్ని స్థానాల నుండి లెక్కలు సేకరించి.. రాష్ట్ర సగటు వెల్లడించేందుకు ఆలస్యం అయ్యింది. తెలంగాణలో మొత్తం పోలింగ్ ఎంత శాతం నమోదు అయిందని ఉత్కంఠ నెలకొనగా.. పోలింగ్ వివరాలను ఇవాళ సీఈవో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed