ఆ ఒక్క పనిచేస్తే సజ్జనార్‌కు రుణపడి ఉంటాం : హనుమంతు

by Shyam |
Mazdoor Union leader Hanumanthu
X

దిశ, పరిగి: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ రావడం ఎంతో మనో ధైర్యాన్ని ఇచ్చిందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ఐదో తారీకు లోపల జీతాలు ఇవ్వలేదన్నారు. సజ్జనార్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెనువెంటనే జీతాలు ఇవ్వడం చాలా సంతృప్తినిస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు దసరా, రంజాన్ పండుగకు అడ్వాన్సుగా చెల్లించాలని కోరారు. వేతన సవరణను అమలు చేసి పెండింగ్‌లో ఉన్న ఐదేళ్ల డీఏ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చేలా చూస్తే రుణపడి ఉంటామని కోరారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా ముందుకు వెళ్లాలని ఆశించారు.

Advertisement

Next Story