తాబేలు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

by Aamani |
తాబేలు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
X

దిశ, సిటీ క్రైమ్ : కొత్త సంవత్సరంలో అదృష్టం కలగాలంటే నక్షత్ర తాబేలును ఇంట్లో పెట్టుకుంటే మీకు ఐశ్వర్యం కలిసి వస్తుందని , ఆరోగ్య సమస్యలు ఉండవని నమ్మించి నక్షత్ర తాబేలు, ఎరుపు రంగు తాబేలును అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ పీర్జాదిగూడ ఆదర్శనగర్ ప్రాంతంలో షేక్ జాని ఫేమస్ అక్వేరియం ను నిర్వహిస్తున్నారు. ఆ దుకాణంలో ఎరుపు రంగు చెవ్వులు ఉన్న తాబేలు, నక్షత్ర తాబేలును విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు సోదాలు జరిపారు. అందులో 5 నక్షత్ర తాబేలు ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విచారించగా మలక్ పేట్ లో న్యూ షైన్ అక్వారియం ను నిర్వహిస్తున్న సిరాజ్ అహ్మద్ వ్యవహారం బయటపడింది. అతని దుకాణంలో సోదాలు జరపగా అందులో 160 నక్షత్ర తాబేళ్లు, ఇంకా కొన్ని గోడౌన్ లో దొరికాయి. ఇలా మొత్తం సిరాజ్ అహ్మద్, షేక్ జానీల నుంచి మొత్తం 285 నక్షత్ర , ఎరుపు రంగు చెవ్వులు ఉన్న తాబేళ్లను స్వాధీనం చేసుకుని వాటిని అటవీ శాఖ అధికారికి అప్పగించారు.

ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విచారణలో ఈ తాబేళ్ల ను బహిరంగ మార్కెట్ లో 25 వేల రూపాయాలకు ఒకటని అమ్ముతున్నారని పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఏపీ కి చెందిన విజయ్ కుమార్ నుంచి రూ. 5 వేల కి కొని మార్కెట్ లో 25 వేలకు అమ్ముతున్నారని విచారణలో తెలిసింది. వీటికి అంతర్జాతీయ మార్కెట్ లో కూడా భారీగా విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ తాబేళ్లు అధికంగా కేరళ, ఒడిశా, తమిళనాడు లోని సముద్ర ప్రాంతాల్లో అధికంగా దొరుకుతాయని తెలిసింది. అక్కడి నుంచి వాటిని తీసుకొచ్చి లక్కీ టార్టాయిస్ ప్రచారం వాటిని విక్రయిస్తారని పోలీసులు దర్యాప్తులో తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed