- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rainbow : ఇంద్రధనస్సు అర్ధచంద్రాకారంలోనే ఎందుకు కనిపిస్తుంది.. కారణం ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ వర్షం పడిన తర్వాత ఆకాశంలో ఓ అద్భుతం దర్శనం ఇస్తుంది. అది ఏంటో కాదు ఇంద్రధనస్సు. వర్షం తర్వాత ఆకాశంలో ఇంద్రధనస్సును చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని మరింత దృఢంగా మార్చే ప్రకృతిలోని కొన్ని అద్భుతాలలో ఇది ఒకటి. ఈ దృశ్యం ఎంతో అందమైని. అయితే ఈ ఇంద్రధనస్సు ఎప్పుడు కనిపించినా పూర్తిగా గుండ్రంగా కాకుండా సగమే కనిపిస్తుంది. నిజానికి ఇంద్రధనస్సు సంపూర్ణంగా గుండ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినా ఎందుకు సగం మాత్రమే కనిపిస్తుందని చాలామందికి ఉన్న సందేహం. మరి దానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది..
సూర్యకిరణాలు, నీటి బిందువుల కలయికతో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. సూర్యకిరణాలు వర్షపు బిందువులను తాకినప్పుడు, ఈ కిరణాలు ఏడు రంగులుగా విభజించబడతాయి. వీటిని మనం ఇంద్రధనస్సుగా చూస్తాము. ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు ఎంతో అద్భుతంగా, మనోహరంగా కనిపిస్తుంది. దాని ఏడు రంగులు ప్రకృతి రంగుల సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి.
యాంటీసోలార్ పాయింట్..
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే యాంటీసోలార్ పాయింట్ స్థానం. యాంటీసోలార్ పాయింట్ ఆకాశంలో లేదా భూమి పై సూర్యుని నుండి సరిగ్గా 180 డిగ్రీల దూరంలో ఉండే ప్రదేశం. ఎర్రటి ఎండలు ఉన్న రోజున మీ నీడ, తల యాంటీసోలార్ పాయింట్‌ను సులువుగా గుర్తిస్తుంది. ఇంద్రధనస్సు ఈ ప్రదేశంలో మాత్రమే సంపూర్ణ వృత్తాకారంలో కనిపిస్తుంది.
ఇంద్రధనస్సు.. సూర్యుని స్థానం..
చాలా మందికి కనిపించే ఇంద్రధనస్సు భాగం నేరుగా సూర్యుని స్థానానికి సంబంధించింది. మన సూర్యుడు హోరిజోన్‌కు కొంచెం పైన చూస్తున్నప్పుడు, యాంటీసోలార్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు తలపైకి వచ్చినప్పుడు కంటే చాలా పెద్ద ఇంద్రధనస్సును చూసే అవకాశాన్ని మీకు అందిస్తుంది. ఇలాంటి సమయాల్లో నేల పై నిలబడి ఆశాశంలోకి చూసినప్పుడు గుండ్రని ఇంద్రధనస్సు దిగువన ఉండే సగం చూడలేము. ఇంద్రధనస్సులో సగభాగం హోరిజోన్ లోకి వెళిపోతుంది. దీంతో మనం సంపూర్ణం ఇంద్రధనస్సును చూడలేము. భూమి ఉపరితలం, హోరిజోన్ మనం చూసే ఇంద్రధనస్సు మన కళ్ళకు పూర్తిగా కనిపించడానికి అనుమతించవు. ఒకవేళ ఇంద్రధనస్సును పూర్తిగా గుండ్రంగా చూడాలనుకుంటే చాలా ఎత్తైన ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా సూర్యుడు హోరిజోన్ కంటే 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే, భూమి పైన కూర్చున్న వ్యక్తులు ఇంద్రధనస్సును అస్సలు చూడలేరు.
Read More..
Patneshwar Nath Temple : అలనాటి కాంతి పుంజం.. అదే ఈనాటి పంచవటి పట్నేశ్వర్ నాథ్ క్షేత్రం..