అతిగా ఇయర్ ఫోన్స్ వాడే వారికి షాకింగ్ న్యూస్!

by Jakkula Samataha |
అతిగా ఇయర్ ఫోన్స్ వాడే వారికి షాకింగ్ న్యూస్!
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు ఇయర్ ఫోన్స్ వాడకం పెరిగిపోతుంది. ఆఫీసుకు వెళ్లినా, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, చివరకు ఇంట్లో ఉన్నా చెవిలో ఇయర్ ఫోన్స్ అనేవి తప్పకుండా ఉంటున్నాయి.అయితే ఇయర్ ఫోన్స్ అతిగా వాడితే వినికిడి సామర్థ్యం పూర్తిగా తగ్గుతుందంట.

కొంత మంది గంటలు గంటలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడటం, పాటలు వినడం చేస్తారు. ఇలా చేయడం అస్సలే మంచిదికాదంట. దీనివల్ల చిరాకు, తలనొప్పి తల తిరగడమే కాకుండా నిరాశ లాంటి సమస్యలు ఎదురవుతాయంట.అలాగే, 60 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్దం ఎవరికైనా సరే హానికరం 70 నుంచి 80 డెసిబిల్స్ మధ్య ధ్వని నిరంతరం బహిర్గతం చేయడం వలన చెవుడు వచ్చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలలో 20 సార్లు 20 నిమిషాల పాటు 90 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే వినికిడి లోపం వస్తుందని పరిశోధకులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed