- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: గగన్‌యాన్ TV-D1 ప్రయోగం సక్సెస్
దిశ, వెబ్‌డెస్క్: మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలు లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 (TV-D1) రాకెట్ టెస్ట్ లాంచ్ సక్సెస్ అయ్యింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుండి TV-D1 రాకెట్ శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 17 కిలో మీటర్ల నిర్ణీత ఎత్తులో రాకెట్ నుండి క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ విజయవంతంగా విడిపోయాయి. పారాచూట్‌లతో సహయంతో క్రూ మాడ్యుల్ గగనతలం నుండి తిరిగి సక్సెస్ ఫుల్‌గా సముద్రంలో ల్యాండ్ అయ్యింది. ఈ ప్రయోగం ద్వారా క్రూ ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుల్ పనితీరును ఇస్రో సైంటిస్ట్‌లు పరీక్షించారు.
కాగా, మొదటగా TV-D1 రాకెట్ ఇవాళ ఉదయం 8.45 నిమిషాలకు లాంచింగ్ కావాల్సి ఉండగా.. సాంకేతిక లోపంతో చివరి క్షణాల్లో ప్రయోగం నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఇస్రో సైంటిస్ట్‌లు సాంకేతిక సమస్యను కనిపెట్టి సరిచేశారు. తిరిగి ఉదయం 10 గంటలకు TV-D1 రాకెట్ లాంచింగ్ ప్రయోగం చేపట్టగా నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో కీలకమైన TV-D1 రాకెట్ ప్రయోగం సక్సెక్ అయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. TV-D1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్ట్‌లు ఆనందం వ్యక్తం చేశారు.