- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డెస్క్‌టాప్ క్రోమ్‌లో కంటెంట్ బయటికి చదివే కొత్త ఫీచర్

దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ దిగ్గజం గూగుల్, తన క్రోమ్ వినియోగదారుల కోసం త్వరలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఉన్నటువంటి “అలౌడ్” ఫీచర్‌ను కొత్తగా తీసుకురానుంది. ఈ ఫీచర్ క్రోమ్‌లో ఉన్న కంటెంట్‌ను బయటికి చదివి వినిపిస్తుంది. మొదటగా డెస్క్‌టాప్ వాడేవారికి అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ కోసం కానరీ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అన్ని పరీక్షలు పూర్తయ్యాక మిగతా యూజర్లకు విడుదల చేయనున్నారు. “అలౌడ్” ఫీచర్ ద్వారా యూజర్లు కంటెంట్‌ను ఆడియో మాదిరిగా వింటారు. అలాగే ఏమైనా ముఖ్యమైన పాయింట్స్ వచ్చినప్పుడు వాటిని మరింత గట్టిగా చదివి వినిపించి యూజర్లకు అర్థం అయ్యేలా చేస్తుంది. దీని వల్ల వినియోగదారులు తమ రీడింగ్ ప్రోగ్రెస్‌ని సులభంగా ట్రాక్ చేయవచ్చు. అలాగే ప్లేబ్యాక్ టైంను ఫాస్ట్‌గా, స్లోగా వినేలా ఆప్షన్ కూడా ఉండనుంది. భవిష్యత్ అప్‌డేట్‌లలో, వినియోగదారుల కోసం వివిధ రకాల వాయిస్ ఆప్షన్‌లను కూడా ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.