‘గెలవడం మాకు అలవాటు.. వచ్చే ఏడాది కప్పు కొడతాం’

by Shyam |   ( Updated:2020-11-11 05:22:00.0  )
‘గెలవడం మాకు అలవాటు.. వచ్చే ఏడాది కప్పు కొడతాం’
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 13లో ముంబై ఇండియన్స్ విజయకేతనం ఎగురవేసి కప్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్ అయ్యాక పలువురు ఆటగాళ్లు తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. విన్నర్‌గా ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ జట్టు కెప్టెన్స్, కోచ్ లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమ్మన్నారంటే?

రోహిత్ శర్మ, కెప్టెన్, ముంబై ఇండియన్స్: గెలవడం మాకు అలవాటుగా మారింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచే మ్యాచ్ ప్రాక్టీస్ చేయడం మాకు కలసి వచ్చింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ వంటి యువకులు పరుగులు సాధిస్తుండటం జట్టుకు పెద్ద బలంగా మారింది. ఈ రోజు నా కోసం సూర్య తన వికెట్ త్యాగం చేశాడు. స్టేడియంలో ఫ్యాన్స్ లేకపోవడం లోటుగా ఉన్నది. ఇలాంటి ఫైనల్స్ ముంబయిలో ఆడితే ఆ ఆనందం మరోలా ఉంటుంది.

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్: కోచ్ రికీ పాంటింగ్‌తో కలసి ఈ జర్నీ చేయడం మంచి అనుభవాన్ని ఇచ్చింది. అతడు ఆటగాళ్లలో చక్కని స్పూర్తిని నింపుతాడు. మా జట్టు, ఆటగాళ్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నది. వచ్చే ఏడాది తప్పకుండా టైటిల్ సాధిస్తామనే నమ్మకం ఉన్నది.

మహేల జయవర్దనే కోచ్, ముంబయి ఇండియన్స్: ఇది చాలా కష్టమైన టోర్నీ. కానీ లీగ్‌కు ముందే మేం పూర్తిగా ప్రాక్టీస్ చేయడం కలసి వచ్చింది. ఇక మా జట్టులో భారీ షాట్లు కొట్టగలిగే వాళ్లు ఉన్నారు. మంచి జట్టు ఉండటం వల్లే వరుసగా విజయాలు సాధించగలిగాము. జట్టులోని ప్రతీ ఆటగాడికి తమ బాధ్యతలు గుర్తు చేస్తూ.. వారిని ముందుగానే సిద్దం చేయగలిగాము. మా కష్టానికి తగిన ఫలితం దక్కింది.

రికీ పాంటింగ్ కోచ్, ఢిల్లీ క్యాపిటల్స్: ఈ సీజన్‌లో ముంబయి జట్టు మమ్మల్ని నాలుగు సార్లు ఓడించింది. అది ఒక మంచి జట్టు. ఢిల్లీ కూడా యువకులతో నిండిన జట్టు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ యువకుడైనా తనను తాను మలుచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరినప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ ఇక్కడ మంచి ఏర్పాట్లు చేశారు. రాబోయే సీజన్‌లో మరింత మంచి వ్యూహాలతో విజయాలు సాధిస్తాము.

Advertisement

Next Story