ఆయన ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు !

by srinivas |
ఆయన ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు !
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొడాలినానిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. చంద్రబాబు పెట్టిన భిక్షతో గెలిచి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బూతుల మంత్రిగా ఉన్న కొడాలి నాని.. ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తాడేపల్లి రాజప్రసాదానికి నెలనెలా జే ట్యాక్స్ కట్టే వ్యక్తి.. ఎన్టీఆర్, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మంత్రి కొడాలి నాని కంటే.. లారీ డ్రైవర్లు, క్లీనర్లు సంస్కారంగా మాట్లాడుతారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ నడుస్తోందని, 1029 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం ఇంతవరకు రాయలసీమలో చెరువులు నింపలేదని ధ్వజమెత్తారు.

పోలవరం ముంపు మండలాలను గాలికి వదిలేసి నిర్వాసితులను నీళ్లపాలు చేశారని, సున్నా వడ్డీ పథకం కింద రైతులు రుణాల కోసం రూ.800 కోట్లు కడితే వారికి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. విద్యుత్ సబ్సిడీ ఎత్తేసి కొత్తగా నగదు బదిలీ పథకం అంటున్నారని, సున్నా వడ్డీ రుణం పథకంలో రైతుల్ని ఎలా మోసం చేశారో అదే విధంగా విద్యుత్ విషయంలో మోసం చేస్తారని విమర్శించారు.

Advertisement

Next Story