- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎందుకు రాజీపడాలి :తాప్సీ
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ తాప్సీ.. క్రేజీ ప్రాజెక్ట్స్, సూపర్ యాక్టింగ్ స్కిల్స్‌తో శభాష్ అనిపించుకుంటోంది. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న భామ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణిస్తున్నా సరే నటనకు పునాది పడింది, తాప్సీ అన్న గుర్తింపు పొందింది మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే అన్న విషయం తెలిసిందే. అందుకే దక్షిణాది సినీ పరిశ్రమకు దూరంగా ఉండలేనంటోంది తాప్సీ. ఇటు బాలీవుడ్, అటు సౌత్ ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తానని చెప్తోంది.
ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు చాలా మంది ఒక్క ఇండస్ట్రీకి మాత్రమే రాజీ పడాల్సి ఉంటుందన్నారని.. కానీ దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో తనకు అర్థం కాలేదని చెప్పింది. హిందీ చిత్రాలు చేయడం ప్రారంభించినప్పుడు ఇక్కడ అలవాటు కావాలి కాబట్టి ఎక్కువ కాన్సంట్రేట్ చేసి, హిందీ సినిమాలు ఎక్కువ చేశానని తెలిపింది. ఏడాదికొక్క సౌత్ ఫిల్మ్ చేస్తానన్న తాప్సీ.. అక్కడి ప్రేక్షకులు తనను చాలా ఆదరించారని, బాలీవుడ్ ఎంట్రీ తర్వాత కూడా తన సినిమాల పట్ల ఆదరణ తగ్గలేదని చెప్పింది.
హిందీతో పాటు సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుండటం.. తను నటిగా ఎదిగేందుకు సహాయపడిందని తెలిపింది. సౌత్‌లో కొత్త చిత్రం చేస్తున్న ప్రతీసారి తమిళ, తెలుగు భాషా నైపుణ్యం పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. ఒకటి కంటే ఎక్కువ ఇండస్ట్రీల్లో తనను ప్రేక్షకులు అంగీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది.