తప్పతాగి స్కూలుకు వచ్చి చిందులేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్

by Shyam |
తప్పతాగి స్కూలుకు వచ్చి చిందులేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్
X

దిశ, మఠంపల్లి: విద్యార్థులకు చక్కటి విద్యను అందించాల్సిన ఉపాధ్యాయుడే పాఠశాల సమయంలో మద్యం తాగి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మఠంపల్లి మండలంలోని రామచంద్రపురం తండా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో లక్ష్మారెడ్డి అనే ఉపాధ్యాయుడు గత కొన్ని నెలలుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పకపోవడం, విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి నా మీద ఫిర్యాదు చేస్తారా అని నోటికొచ్చినట్టు తన తోటి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను తను ఇష్టం వచ్చినట్టు ఉంటానని దుర్భాషలాడాడు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు సూర్యాపేట జిల్లా విద్యాధికారి ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డిని సస్పెండ్ చేసినట్టు జిల్లా అధికారులు తెలిపారు.

Advertisement

Next Story