- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 50 వేలు కడితే అర్ణబ్‌కు బెయిల్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల ద్విసభ్య ధర్మాసనం గోస్వామికి రూ.50వేల పూచీకత్తుతో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. రెండు రోజుల్లో ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. 2018లో ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయిక్ సూసైడ్‌కు కారకులన్న అభియోగాల కింద అర్ణబ్ గోస్వామి సహా మరో ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సెంట్రల్ తలోజా జైలులో ఉన్న గోస్వామి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. తాజాగా, మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తూ ముగ్గురుకీ బెయిల్ మంజూరు చేసింది. ‘అప్పు తిరిగివ్వకపోవడం ఆత్మహత్యకు కారణమవుతుందా? దీనికోసం నిందితుడికి బెయిల్ తిరస్కరించారంటే అపహాస్యం కాకమరేంటి?’ అని ధర్మాసనం మండిపడింది. ‘టీవీ డిబేటుల్లో ప్రభుత్వంపై ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవద్దు. మనది సహనపూరిత ప్రజాస్వామ్యం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇండివిడ్యువల్స్(వ్యక్తులను)ను టార్గెట్ చేస్తే ఆ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటానికి సుప్రీంకోర్టు ఉన్నదని గుర్తుంచుకోవాలి. హైకోర్టులూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఎత్తిపట్టేలా వ్యవహరించాలి’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.