- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూసుఫ్‌గూడలో దారుణం.. ఆమెకు 20, అతనికి 17 ఇద్దరూ కలిసి..
దిశ, వెబ్‌డెస్క్ : నగరంలోని యూసుఫ్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో యువకుడు మృతిచెందగా.. యువతి ప్రాణాలతో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలో నివసించే యువకుడు(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో సినీ పరిశ్రమలో పని చేస్తున్న యువతి (20)తో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు నచ్చకపోవడంతో.. జవహార్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వారం క్రితం వారు గదిలో పెళ్లి చేసుకున్నారు. కాగా.. రెండు రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. మనస్పర్థలు పెరగడంతో ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సందర్భంలో యువతి చున్నీ ఊడిపోవడంతో ఆమె కింద పడిపోయింది. కానీ.. యువకుడి మెడకు ఉరి బిగుసుకుపోవడంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.