నారాయణపేట జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2020-02-20 04:14:39.0  )
నారాయణపేట జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య
X

నారాయణపేట జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కొస్గి మండలం చంద్రవంచకు చెందిన మారుతి అనే డిగ్రీ విద్యార్థి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన కొందరు బెదిరించడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మారుతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story