- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KU క్యాంపస్‌లో విద్యార్థుల ధర్నా.. రిజిస్ట్రార్‌తో కీలక చర్య
దిశ, కేయూ క్యాంపస్ : గత వారం ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ వల్ల పలువురు విద్యార్థులను సస్పెండ్ చేస్తామని కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు తేల్చిచెప్పారు. అయితే, విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేయవద్దని, తాము చదువుకోవడానికి వస్తే మమ్మల్ని ఈవిధంగా సస్పెండ్ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు.
ఈ సమయంలో అక్కడికి వచ్చిన రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డితో విద్యార్థులు వాదించారు. దానికి బదులుగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఈ సమయంలో మీరు ధర్నా చేయడం సరికాదన్నారు. విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు మంగళవారం ఉపకులపతితో ఈ విషయంపై చర్చించనున్నట్టు తెలిపారు. దీంతో విద్యార్థులు శాంతించారు. ఈ నేపథ్యంలో రేపు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ విద్యార్థుల్లో నెలకొంది.