- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగిన గల్ఫ్ గుండె
దిశ సిద్దిపేట: పొట్ట కూటి కోసం, కుటుంబ పోషణ భారమై గల్ఫ్ దేశానికి వెళ్లిన సిద్దిపేట పట్టణానికి చెందిన భుంపల్లి కృష్ణ అనే కార్మికుడు బైరాన్ లో ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కృష్ణ మరణ వార్త విన్న కుటుంబీకులు దుఖ: సాగరంలో మునిగారు. సిద్దిపేట పట్టణంలోని దోభి గల్లికి చెందిన భుంపల్లి కృష్ణకి భార్య వసంత, ఇద్దరు కూతుర్లు నందిని , ప్రవల్లికా లు ఉన్నారు. కృష్ణకు ధోభి వృత్తి చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లను కుటుంబాన్ని పోషించడం భారంగా మారి కొంత అప్పు చేశాడు. అప్పు తీర్చడం కోసం ఎటు పాలు పోలేని స్థితిలో ఐదు సంవత్సరాల కిందట మరింత అప్పు చేసి ఏజెంట్ ద్వారా బైరాన్ లోని ఓ కంపనీలో కార్మికుడిగా చేరాడు. అప్పటి నుండి కృష్ణ సంపాదన అప్పు తీర్చడానికే సమయం సరిపోయింది. గత ఏడాది కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో అతనికి బైరాన్‌లో పూట గడవడం కష్టంగా మారింది.
భారత్‌కు వద్దామంటే ఒకవైపు లాక్ డౌన్, మరో వైపు చేసిన అప్పుల ఆలోచన వచ్చేది. కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చినప్పుడు ఎంతో బాధ పడేవాడు. ఈ నెల 11న కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని బైరాన్ నుండి కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో కృష్ణ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కృష్ణ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి అని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. కృష్ణ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రి హరీష్ రావు ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొని అతని మృతదేహాన్ని భారత్‌కి తెప్పించి ఆ చిన్నారుల కడసారి చూపు చూసేందుకు సహాయ సహకారాలు అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.