తెలంగాణలో రాళ్ల వాన

by Shyam |
తెలంగాణలో రాళ్ల వాన
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కోహెడ, బెజ్జంకి మండలాల్లోని గుగ్గిళ్ళ, వరికోలు, శంకర్ నగర్, తిమ్మయ్యపల్లెతో పాటు పలు గ్రామాల్లో ఇవాళ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన రాళ్ళవాన బీభత్సం సృష్టించింది. ఈ వడగళ్ళు రాళ్లు దెబ్బకు చేతికొచ్చిన వరిపంట నేలమట్టం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే రాళ్లవానకు మామిడి తోటల్లోని మామిడి కాయలు రాలిపోయినట్లు రైతులు చెబుతున్నారు. అకాల వర్షం అపార నష్టం సృష్టించిందని, అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story