- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసులు
దిశ, హైదరాబాద్ :
ఒకే రోజు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాగా, మరొకరు అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉంటూ, ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఒకరు దళిత మైనర్ బాలిక పై అత్యాచార ఘటనలో బాధితురాలిని సందర్శించేందుకు వచ్చిన ఓ దళిత మహిళా నేతను పరుష పదజాలంతో దూషించగా, మరొకరు రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్థానిక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన కనీస మర్యాద ప్రోటోకాల్ పాటించకుండా దూషించడంతో ఈ కేసులు నమోదయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంఐఎం పార్టీకి చెందిన మలక్ పేట ఎమ్మెల్యే మహ్మద్ బలాలపై ఒకే రోజున కేసులు నమోదు కావడం విశేషం. ఈ కేసులలో ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారా లేక రాజకీయ ఒత్తిళ్ళు పనిచేస్తాయా వేచి చూడాలి.
దళిత మైనర్ బాలిక రేప్ ఘటనలో…
హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 6వ తేదీ అర్థరాత్రి స్థానిక కమలానగర్ బస్తీలో ఓ దళిత మైనర్ బాలికపై అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత బాధితురాలిని పరామర్శించేందుకు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుల, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, ఇతర నేతలతో ఆ పార్టీ జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి బంగారు శృతి ఈ నెల 7వ తేదీన కమలానగర్ బస్తీకి వచ్చారు. అదే రోజు ఎంఐఎం ఎమ్మెల్యే బలాల కూడా తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చారు. థర్డ్ క్లాస్ వాలే, చోర్ లోగ్ అంటూ అసంబద్ధంగా, అవమానకరంగా తన కులం పేరు ప్రస్తావించి దూషించినట్లు పేర్కొంటూ చాదర్‌ఘాట్ పోలీసులకు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని, మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఎమ్మెల్యే బలాలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు ఎమ్మెల్యే కావడంతో న్యాయ సలహా తీసుకున్న పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్ట ప్రకారం ఐపీసీ 509 సెక్షన్ 3 (1)(r) కింద కేసు నమోదు చేసినట్టు చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు.
ప్రోటోకాల్ వివాదంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నందివనపర్తి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా మేడిపల్లి గ్రామానికి (ఫార్మాసిటీ రోడ్) రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎంపీపీగా తనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఇవ్వలేదని, సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేని సుకన్య నిలదీశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ‘నీ పాత్ర ఏమీ లేదంటూ అవమానకరంగా, నన్ను నెట్టివేశారు. ప్రజలందరి ముందూ నన్ను అవమానపర్చారు’ అని సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మహిళ అనే ఉద్దేశంతోనే తనను పిలవకుండా ఎమ్మెల్యే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఐపీసీ 323 సెక్షన్ 3(1)(r)(s) ప్రకారం కేసు నమోదు చేశారు.