మాహిష్మతిలోనూ మాస్క్ లు..

by Shyam |
మాహిష్మతిలోనూ మాస్క్ లు..
X

కరోనాతో సహజీవనం చేయాలంటే మాస్క్‌లు, శానిటైజర్లు వాడాల్సిందే. లేదంటే కరోనా బారినపడి కష్టాలు పడాల్సిందే. ఇకమీదట మాస్క్, శానిటైజర్ నిత్య జీవితంలో భాగమైపోవాలని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. కానీ కొంత మంది ఈ ప్రచారాన్ని పెడ చెవిన పెడుతున్నారు. అలాంటి వారికోసమే.. అవిటూన్ ఇండియా, కొల్లాజ్ యునైటెడ్ సాఫ్ట్ విఎఫ్ఎక్స్ టీమ్స్ వినూత్నంగా ఆలోచించారు.

ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన బాహుబలి సినిమాను ఎంచుకున్నారు. మాస్క్‌ల ప్రాధాన్యత గురించి చెప్తూ.. బాహుబలి, భల్లాల దేవుడి ఫైటింగ్ సీన్‌లో ఇద్దరికీ కూడా మాస్క్‌లు ఉండేలా గ్రాఫిక్ డిజైన్ చేశారు. ‘మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్క్‌లు తప్పనిసరి అని.. మీరు కూడా మరిచిపోవద్దని’ సూచించారు. ఈ వీడియోను షేర్ చేసిన బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి.. గ్రాఫిక్ టీమ్స్‌ను అభినందించారు. ఈ సమయంలో ప్రతీ ఒక్కరు సురక్షితంగా.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story