‘దండం పెడుతా.. బయటకు రాకండి’

by Shyam |
‘దండం పెడుతా.. బయటకు రాకండి’
X

దిశ, మహబూబ్ నగర్: ‘మీకు దండం పెడుతా.. ప్రజలెవరూ బయటకు రావొద్దు’ అంటూ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పూణె, ముంబై, విదేశాల నుంచి జిల్లాకు సుమారు 3 నుంచి 4వేల మంది వచ్చినట్లు సమాచారం ఉందన్నారు. ఇలా వచ్చిన వారి వివరాలను గ్రామస్థులు కచ్ఛితంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు. వ్యాధి తీవ్రత పెరిగితే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని అన్నారు. అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 10 గంటల తరువాత ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో 3 రైతు బజార్లను ఏర్పాటు చేస్తామనీ, అంతేకాకుండా నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని హామీనిచ్చారు. అలాగే, వ్యాపారులెవరైనా సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Tags: sport minister srinivas goud, requested people, dont come out, corona outbreak, virus

Advertisement

Next Story

Most Viewed