- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు వైభవోత్సవ మండపంలో సహస్రదీపాలంకారసేవ నిర్వహించారు. ఆ తరువాత శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
రాత్రి 8 నుండి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని పట్టాభిషేక సర్గ పారాయణం చేశారు. ఆ తరువాత స్వామివారికి అక్షతారోపణ, నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు. అనంతరం సుగ్రీవుడు, అంగదుడు ఉత్సవమూర్తులను వేంచేపు చేసి వారితోపాటు ఆంజనేయస్వామివారికి పుష్పమాలలు సమర్పించారు. జీయ్యంగార్లకు, అధికారులకు పరివట్టం కట్టి శఠారి సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ పాల్గొన్నారు.