- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: ఢిల్లీకి కొత్త కెప్టెన్.. రేసులో ఇద్దరు స్టార్ ప్లేయర్స్..!!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందే ఢిల్లీ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న పంత్ పూర్తి కోలుకోవడానికి మూడు నుండి ఆరు నెలల సమయం పడుతోందని వైద్య నిపుణులు తెలిపారు. దీంతో మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు అతడు పూర్తిగా దూరం కానున్నాడు. గత కొన్ని సీజన్లుగా ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న పంత్.. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరం కావడం ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
ఈ సీజన్‌కు పంత్ దూరం కానుండటంతో.. ఈ సారి ఢిల్లీని కొత్త కెప్టెన్ నడిపించనున్నాడు. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్, యంగ్ ఆటగాడు పృథ్వీ షా ఉన్నట్లు సమాచారం. అయితే, ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్, ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్‌కు పగ్గాలు అప్పగించేందుకు ఢిల్లీ యాజమాన్యం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అనుభవం, కెప్టెన్‌గా హైదరాబాద్‌కు టైటిల్ అందించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని.. ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలను వార్నర్‌కు ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read...
ఐపీఎల్‌కు భారత స్టార్ ప్లేయర్ దూరం.. ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ..!