ఐపీఎల్‌కు భారత స్టార్ ప్లేయర్ దూరం.. ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ..!

by Satheesh |   ( Updated:2023-01-02 03:26:14.0  )
ఐపీఎల్‌కు భారత స్టార్ ప్లేయర్ దూరం.. ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ ప్లేయర్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుండి రూర్కీ వెళ్తుండగా జాతీయ రహదారిపై పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకున్నాడు. అయినప్పటికీ పంత్‌కు పెద్ద పెద్ద గాయాలయ్యాయి. నుదురు చిట్లిపోవడం, మోకాలి లిగమెంట్ తెగిపోవడం, వీపు భాగంలో కాలడంతో ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే, రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్ పూర్తిగా కోలుకునేందుకు మూడు నుండి ఆరు నెలల సమయం పడుతోందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. తీవ్ర గాయాలు కావడంతో పంత్‌‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

అతడు పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలల వరకు సమయం పడుతోందని పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు పంత్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ అప్పటివరకు కోలుకునే ఛాన్స్ లేదని డాక్లర్లు వెల్లడించారు. దీంతో పంత్ ఐపీఎల్ సీజన్ 16 మొత్తానికి దూరం కానున్నాడు. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని కసితో ఉన్న ఢిల్లీకి.. కెప్టెన్ పంత్ దూరం కావడం భారీ ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు. అంతేకాకుండా పంత్ టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య భారత్‌లో జరిగే టెస్ట్ సిరీస్‌కు సైతం దూరం కానున్నాడు. గత కొంత కాలంగా టీమిండియాకు టెస్ట్‌ల్లో అద్భుత విజయాలు అందిస్తున్న పంత్.. కీలకమైన సిరీస్‌కు దూరం అవ్వడం భారత్‌కు ఎదురు దెబ్బ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed