- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సౌర్యకు పతకం ఖాయం
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు సౌర్య బావా పతకం ఖాయం చేసుకున్నాడు. అమెరికాలో జరుగుతున్న టోర్నీలో అతను సెమీస్‌కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సౌర్య 2-11, 11-4, 10-12, 11-8, 12-10 తేడాతో మలేసియాకు చెందిన లో వా-సెర్న్‌పై విజయం సాధించాడు. ఐదు గేమ్‌లపాటు సాగిన మ్యాచ్‌లో సూర్య పోరాడి గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో కుష్ కుమార్(2014) తర్వాత సెమీస్‌కు చేరుకున్న రెండో భారత పురుష ప్లేయర్‌గా నిలిచాడు. సెమీస్‌లో సౌర్య ఈజిఫ్ట్‌కు చెందిన మహ్మద్ జకారియాతో తలపడనున్నాడు.
మరోవైపు, మహిళల నేషనల్ చాంపియన్ అనాహత్ సింగ్ పతక పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో ఆమె 11-8, 11-9, 5-11, 10-12, 13-11 తేడాతో ఈజిఫ్ట్ క్రీడాకారిణి నాడియన్ ఎల్‌హమ్మమీ చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్స్‌లో వెనుదిరగడం అనహత్ సింగ్‌కు వరుసగా ఇది మూడోసారి. ఇక, టోర్నీలో ఆమె 5వ స్థానం కోసం పోటీపడనుంది.