మరిన్ని గ్రాండ్‌స్లామ్స్ నెగ్గాలి : Novak Djokovic

by Vinod kumar |
మరిన్ని గ్రాండ్‌స్లామ్స్ నెగ్గాలి : Novak Djokovic
X

లండన్ : టెన్నిస్‌లో విజయాలు కోసం ఇంకా ఆకలితోనే ఉన్నానని, మరిన్ని గ్రాండ్‌స్లామ్స్ గెలవాలని ఉందని దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ తెలిపాడు. ఈ ఏడాది వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్స్‌లను జకో తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడంతో 23 గ్రాండ్‌స్లామ్స్‌లతో మెన్స్ సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు జకోవిచ్ వింబుల్డన్ బరిలో నిలిచాడు. నేటి నుంచి వింబుల్డన్ మొదలు కానుంది. ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ముందు జకోవిచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు తెలిపాడు. ‘సత్తా ఉన్నంత వరకూ ఆటలో ఉన్నత స్థానంలో ఉంటానని నాకు తెలుసు. అది భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటాను. ఇంకా నాలో సత్తా ఉంది. విజయం కోసం నేను ఇంకా ఆకలితోనే ఉన్నాను. టెన్నిస్‌లో మరిని గ్రాండ్‌స్లామ్స్, విజయాలు సాధించాలి. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తర్వాత అందరూ నన్ను అభినందించారు. మెచ్చుకున్నారు.

కానీ, అదే సమయంలోనే తర్వాతి స్లామ్ ఏంటి?. తర్వాతి టాస్ ఏంటి? అని ఆలోచించాను. ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌కు అలా మెంటాలిటీ అవసరం అని నా అభిప్రాయం. అయితే, మరిని గ్రాండ్‌స్లామ్స్ గెలవాలంటే ఏకాగ్రత, ఆటపై భక్తి అవసరం.’ అని జకో తెలిపాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో మరో దిగ్గజ ఆటగాడు రాఫెల్ నదాల్(22 గ్రాండ్‌స్లామ్స్)ను వెనక్కినెట్టిన జకోవిచ్ ఇప్పుడు మాజీ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ రికార్డుపై కన్నేశాడు. ఫెదరర్ 8సార్లు వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు. జకోవిచ్ ఏడుసార్లు చాంపియన్‌గా నిలువగా.. 8వ టైటిల్ గెలిచి ఫెదరర్ రికార్డును సమం చేయాలని చూస్తున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న జకోవిచ్.. నేడు అర్జెంటీనాకు చెందిన పెండ్రో కాచిన్‌తో తలపడటంతో టోర్నీని మొదలుపెట్టనున్నాడు.

Advertisement

Next Story