- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WI vs SA 2nd Test: మార్‌క్రమ్, కైల్ వెర్రేన్నే హాఫ్ సెంచరీలు.. పుంజుకున్న సౌతాఫ్రికా
దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య వెస్టిండీస్‌తో ఆసక్తికరంగా మొదలైన రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో రోజు పుంజుకుంది. శుక్రవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 223/5 స్కోరు చేసిన దక్షిణాఫ్రికా 239 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి రోజు ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో సౌతాఫ్రికా, వెస్టిండీస్ స్వల్ప స్కోర్లకే ఆలౌటయ్యాయి. మొదట సౌతాఫ్రికా 160 పరుగులకే కుప్పకూలింది. అనంతరం విండీస్ 144 రన్సే చేసింది. శుక్రవారం రాత్రి ఓవర్‌నైట్ స్కోరు 97/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కరేబియన్ జట్టు మరో 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.
సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్(4/32), నాండ్రే బర్గర్(3/49), మహరాజ్(2/8) సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన సౌతాఫ్రికా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నారు. మార్‌క్రమ్(51), కైల్ వెర్రేన్నే(50 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటి జట్టును పోటీలో ఉంచారు. ఓపెనర్ టోనీ డె జోర్జీ(39) సహకారంతో మార్‌క్రమ్ జట్టుకు మంచి ఆరంభం అందించాడు. ఆ తర్వాత కెప్టెన్ బావుమా(4), డేవిడ్ బెడింగ్‌హామ్(0) నిరాశపర్చగా.. కైల్ వెర్రేన్నే(50 బ్యాటింగ్), వియాన్ ముల్డర్(34 బ్యాటింగ్) కలిసి జట్టును భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 3, గుడాకేశ్ మోటీ 2 వికెట్లు తీశారు.