నేడు క్రికెటర్ శివమ్ దూబే పుట్టిన రోజు

by Prasanna |
నేడు క్రికెటర్ శివమ్ దూబే పుట్టిన రోజు
X

దిశ, ఫీచర్స్ : క్రికెట్ పిచ్ లో శివమ్ దూబే ఆట గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిడిల్ ఓవర్లలో కూడా బ్యాటింగ్ చేయగలడు. ఎలాంటి బంతిని అయినా సరే సులభంగా హిట్ చేయగలడు. బౌలర్ ఎంత గట్టిగా బాల్ విసిరినా బౌండరీస్ కొట్టగలడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడినప్పటి నుంచి శివమ్ దూబే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని బలమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి గట్టి పోటీ ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. రింకు సింగ్ వంటి ఫినిషర్‌లను పక్కన పెట్టి, 2024 T20 ప్రపంచ కప్‌లో జట్టులో చోటును కల్పించారు. నేడు తన 31 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed