- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సమయంలో చాలా భయమేసింది.. కారు ప్రమాదంపై పంత్ రియాక్షన్
దిశ, స్పోర్ట్స్ : కారు ప్రమాదంలో తన కాలు తెగిపోతుందేమోనని భయపడ్డానని టీమ్ ఇండియా వికెట్ కీపర్ తెలిపాడు. 2022 డిసెంబర్‌లో ఘోర కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంత్ కారు ప్రమాదం గురించి మాట్లాడాడు. ‘నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోవడానికి అవకాశం ఉంది. అందుకే, నాకు చాలా భయమేసింది.’ అని చెప్పాడు ‘రెండో జీవితం అందరికీ రాదు. నాకు వచ్చింది. అందుకు నేను అదృష్టవంతుడిని. రికవరీకి ఎంత టైం పడుతుందని డాక్టర్‌ను అడిగాను. 16 నుంచి 18 నెలలు పుడుతుందని చెప్పారు. మీరు నాకే ఏం టైం లైన్ ఇచ్చినా.. దానికి ఆరు నెలల ముందే రికవరీ అవుతానని డాక్టర్‌కు చెప్పా. ప్రపంచం నుంచి దూరంగా ఉండాలనుకున్నా. నేను వేగంగా రికవరీ అయ్యేందుకు అది నాకు సహాయపడింది. నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టే వరకు భవిష్యత్తుపై ఎలాంటి ప్లాన్స్ చేసుకోవాలని అనుకోవడం లేదు.’అని పంత్ చెప్పుకొచ్చాడు. కాగా, గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్న పంత్ రీఎంట్రీ సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌తో అతను తిరిగి మైదానంలో అడుగుపెడతాడని వార్తలు వస్తున్నాయి.
- Tags
- #Rishabh Pant