- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూరో కప్‌కు వేళాయే..!
దిశ, స్పోర్ట్స్: సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే మహాఘట్టం నేడు(శనివారం) నుంచి యూరో కప్ టోర్నీ ప్రారంభం కానుంది.ఫిఫా వరల్డ్ కప్ తర్వాత అత్యధిక మంది ఫుట్ బాల్ అభిమానులు ఈ యూరోకప్‌కు దాసోహం అంటారు. యూరో కప్ టోర్నీ సాధారణంగా నాలుగేళ్ల కొకసారి జరుగుతుంటుంది.
భారత కాలమానం ప్రకారం ఈ వేడుక శనివారం ఉదయం 12.30 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. మొత్తంగా ఐరోపా ఖండం నుంచి 24 అత్యుత్తమ జట్లు ఈ టోర్నమెంట్‌లో బరిలో నిలిచాయి. గ్రూప్-ఏలో తొలి మ్యాచ్ ఆతిథ్య జర్మన్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరగనుంది.
జార్జియా దేశం తొలిసారిగా ఈ టోర్నీలోకి అడుగుపెట్టింది. జూన్ 14 నుంచి వచ్చేనెల 14 వరకు 10 నగరాల్లో కలిపి మొత్తం 51 మ్యాచులను నిర్వహించనున్నారు. మొత్తం 24 జట్లు 6 గ్రూపులుగా విడిపోయి గ్రూప్ దశలో తలపడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో ఒక్కో జట్టు ఇతర దేశాలతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన మొత్తం 12 జట్లతో పాటు .. అన్ని గ్రూపుల్లో కలిపి మూడో స్థానంలో నిలిచిన 4 అత్యుత్తమ జట్లు ప్రిక్వార్టర్స్ (రౌండ్ 16)కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ జరుగుతాయి. 2000 సంవత్సరం తర్వాత తొలిసారి రష్యా జట్టు లేకుండా ఈ టోర్నీ జరుగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా జట్టును ఐరోపా ఫుట్‌బాల్ సంఘాల కూటమి (యూఈఎఫ్ఏ) నిషేధించిన విషయం తెలిసిందే.
కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టోర్నీని 2021లో నిర్వహించగా..అప్పుడు ఇటలీ దేశం యూరో కప్ విజేతగా నిలిచింది. ఆ దేశానికి ఇది రెండో టైటిల్. అయితే, ఇటు యూరో కప్ టోర్నీ జరుగుతుండగానే.. అమెరికాలో ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ ‘కోపా అమెరికా’ ఈనెల 20న ప్రారంభం కానుండటంతో ప్రపంచవ్యాప్తంగా సాకర్ గేమ్ సందడి నెలకొననుంది.