ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ

by GSrikanth |   ( Updated:2023-09-17 13:44:47.0  )
ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టు నిర్ధేశించిన 50 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 6.1 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 27 పరుగులు, ఇషాన్ కిషన్ 23 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. కాగా, టీమిండియా ఆసియా కప్ గెలవడం ఇది ఎనిమిదసారి కావడం గమనార్హం. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించారు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్‌లు తీయడంతో పాటు వన్డే క్రికెట్‌లో తొలిసారి ఆరు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు.

Advertisement

Next Story

Most Viewed