- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND vs SL: చెలరేగిన సూర్య, రిషబ్ పంత్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
దిశ, వెబ్‌డెస్క్: మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. వరల్డ్ చాంఫియన్స్ హోదాలో బరిలోకి దిగిన భారత్.. అదే రేంజ్‌లో ఫర్మామెన్స్ చేసింది. క్రీజ్‌లోకి వచ్చిన వారు వచ్చినట్లే అతిథ్య శ్రీలంక బౌలర్లను ఉతికారేశారు. బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
శనివారం రాత్రి పల్లెకెలె స్టేడియం వేదికగా జరుగుతోన్న తొలి టీ-20 మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (40), శుభమన్ గిల్ (34) రన్స్‌తో మెరుపు ఆరంభాన్ని అందించారు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టేడియంలో ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించాడు.
కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 58 రన్స్ చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసి (49) హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. శ్రీలంక బౌలర్లలో మతీశా పతీరణ నాలుగు వికెట్లు తీసి భారత్ బ్యాటర్లను కాస్త నిలువరించాడు. హసరంగా, మధుశంక, ఫెర్నాండో తలో వికెట్ తీశారు. అనంతరం శ్రీలంక 214 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగింది.