- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు దూసుకెళ్లిన టెన్నిస్ సంచలనం.. 68వ స్థానానికి సుమిత్
దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నగాల్ కొంతకాలంగా సత్తాచాటుతున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించిన విషయం తెలిసిందే. నిలకడగా రాణిస్తున్న అతను క్రమంగా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంటున్నాడు. తాజాగా కెరీర్ బెస్ట్ వరల్డ్ ర్యాంక్‌ను సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్(ఏటీపీ) తాజాగా రిలీజ్ చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సుమిత్ టాప్-70లోకి అడుగుపెట్టాడు. ఐదు స్థానాలను వెనక్కినెట్టిన అతను 779 పాయింట్లతో 68వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో అతను 72వ ర్యాంక్‌లో ఉన్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్న సుమిత్ 1973 తర్వాత భారత్ తరపున హయ్యెస్ట్ ర్యాంక్ పొందిన 4వ ప్లేయర్‌గా నిలిచాడు. సుమిత్ కంటే ముందు భారత్ తరపున విజయ్ అమృత్‌రాజ్(1980లో 18వ ర్యాంక్), రమేశ్ కృష్ణన్(1985లో 23వ ర్యాంక్), సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్(2011లో 62వ ర్యాంక్) అత్యుత్తమ ర్యాంక్‌లు పొందారు.