ఆసియా కప్ నుంచి ఆ దేశం ఔట్.. సూపర్ 4కి శ్రీలంక..

by Javid Pasha |
ఆసియా కప్ నుంచి ఆ దేశం ఔట్.. సూపర్ 4కి శ్రీలంక..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4కి శ్రీలంక టీం క్వాలిఫై అయింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో పోరాడిన శ్రీలంక రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసియా కప్ 2022 గ్రూప్ బీ నుంచి సూపర్ 4కి చేరుకున్న జాబితాలో ఆఫ్ఘనిస్తాన్‌తో లంక చేరింది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పరాజయం పాలవడంతో బాంగ్లాదేశ్ ఇంటి బాట పట్టింది. శ్రీలంకతో జరిగిన హోరాహోరీ పోరులో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు సాధించింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఈ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో సాధించి ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 37 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత రెహ్మాన్ బౌలింగ్‌లో తస్కిన్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత లంక జట్టు తరపున మైదానంలోకి దిగిన ఆటగాళ్లు ఆశించిన స్థాయి పోటీ ఇవ్వలేక పోయినా ఆరో స్థానంలో బరిలోకి దిగిన శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక మాత్రం మరోసారి పరుగులు పారించాడు. 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ ఎబడాట్ హొస్సెయిన్ 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Advertisement

Next Story

Most Viewed