తొలి టెస్టులో శ్రీలంకపై విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టిన సౌతాఫ్రికా

by Harish |
తొలి టెస్టులో శ్రీలంకపై విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టిన సౌతాఫ్రికా
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికాకు భారీ విజయం దక్కింది. డర్బన్ వేదికగా శనివారం ముగిసిన మ్యాచ్‌లో 233 పరుగుల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 516 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 282 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 103/5తో ఆ జట్టు శనివారం ఆట కొనసాగించగా.. దినేశ్ చండీమాల్(83), కెప్టెన్ ధనంజయ డి సిల్వ(59), కుసాల్ మెండిస్(48) పోరాడినా ఫలితం దక్కలేదు. 179 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీల జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లారు.అలాగే, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప(డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లింది.

Advertisement

Next Story