శ్రీవారి భక్తులకు BIG షాక్.. తిరుమల బోర్డు షాకింగ్ డెసిషన్

by Gantepaka Srikanth |
శ్రీవారి భక్తులకు BIG షాక్.. తిరుమల బోర్డు షాకింగ్ డెసిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్యాకేజీ టూరిస్టులకు టీటీడీ షాక్ ఇచ్చింది. తిరుమలేషుడిని దర్శించుకునేందుకు టూరిజం, ఆర్టీసీ, ట్రావెల్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ నెల 1 నుంచి అనుమతులను నిలిపివేసింది. ఒక తెలంగాణే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్యాకేజీ పర్యాటకులకు అనుమతి లేదని టీటీడీ బోర్డు ప్రకటించింది. అంతేకాదు ఆర్టీసీకి కూడా సమాచారం ఇచ్చింది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించింది. దర్శన టికెట్ల దందా, అనుమతిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని బోర్డు దృష్టికి రావడంతోనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం వేంకటశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులను నిరాశకు గురిచేసింది. ప్రైవేటు, టూరిజం, ఆర్టీసీ తరఫున ప్యాకేజీపై తిరుపతికి నిత్యం వెళ్తుంటారు. వారు ముందుగానే దర్శన టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకొని వెళ్తుంటారు. అయితే టీటీడీ బోర్డు నూతన కమిటీ అలా వెళ్లేవారికి అనుమతి లేదని ప్రకటించింది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామివారి దర్శనం చేసుకోవాలని పేర్కొంది. తెలంగాణ టూరిజం నుంచి హైదరాబాద్ టు తిరుపతికి రోజుకు రెండు నుంచి మూడు బస్సులు వెళ్తాయి. ప్రతి రోజూ సుమారు 200మందికిపైగా భక్తులు దర్శనానికి వెళ్తారు. మూడు రోజుల టూర్లో భాగంగా తిరుపతి, తిరుమల, తిరుచానూర్ లో పర్యటించే అవకాశం కల్పించింది. స్వామివారి శ్రీఘ దర్శనం కల్పించి తర్వాత ఇతర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ హైదరాబాద్ కు తీసుకొస్తారు. ఈ ప్యాకేజీలోనే తిరుపతిలో స్వామివారి దర్శనంతోపాటు అకమిడేషన్ కల్పిస్తారు. భోజనం ఖర్చులు ఎవరికివారే సొంతంగా భరించాల్సి ఉంటుంది. ప్రతి శుక్ర, శనివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఉందని టూరిజం అధికారులు తెలిపారు. బస్సులను బట్టి ప్యాకేజీలను ఫిక్స్ చేసింది. టీటీడీ బోర్డు నిర్ణయంతో టూరిజంతో పాటు ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఎఫెక్ట్

టీటీడీ బోర్డు నిర్ణయంతో ప్రైవేట్ ట్రావెల్స్ పై భారీగా ఎఫెక్ట్ పడనుంది. నిత్యం ట్రావెల్స్ తో వెయ్యి నుంచి 2వేల మంది వరకు తిరుపతికి వెళ్తుంటారు. అయితే టీటీడీ బోర్డు ప్రత్యేక దర్శనాలు నిలిపి వేయడంతో ఉపాధిపై ఎఫెక్టు పడుతుందని ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. టీటీడీ నిర్ణయంతో బస్సులకు ఈఎంఐలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందని, తమ ఉపాధిని చెడగొట్టొద్దని పలువురు టీటీడీ బోర్డుకు విజ్ఞప్తి చేస్తున్నారు.

దర్శన టిక్కెట్ల దందాను అరికట్టేందుకేనా..?

స్వామివారి దర్శనానికి సంబంధించిన టిక్కెట్ల విషయంలో గోల్ మాల్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. టూర్ ప్యాకేజీ పేరుతో స్వామివారి దర్శన టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ టిక్కెట్ల దందా నేపథ్యంలో టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసలు దర్శన టికెట్లను ఎవరు అనుమతి ఇచ్చారు?.. దాని ప్రాసెస్ ఏంటి?..టికెట్లు పక్కదారి ఎలా పట్టిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ దందాను అరికట్టేందుకు బోర్డు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా టూరిజం, ఆర్టీసీ తరఫున ప్యాకేజీలపై వచ్చేవారికి తిరుమలలో దర్శనానికి అనుమతి లేదని చెప్పినట్లు సమాచారం. ఇక నుంచి వారు కూడా సాధారణ భక్తుల మాదిరిగా దర్శనం చేసుకోవాలని పేర్కొంది. తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాల నుంచి టూరిజం, ఆర్టీసీ ప్యాకేజీలపై వచ్చే భక్తులు, టూరిస్టులకు ఈ నిర్ణయం వర్తించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. అయితే బోర్డు నిర్ణయంతో నష్టం జరుగుతుందని త్వరగా నిర్ణయం తీసుకోవాలని టూరిజం, ఆర్టీసీ అధికారులు, ట్రావెల్స్ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉపాధిపై ఎఫెక్ట్: నగేష్ పాంపాటి, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ, తెలంగాణ చైర్మన్

ట్రావెల్స్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లేవారు ముందుగా ఆన్ లైన్ లో దర్శన టికెట్లను బుక్ చేసుకుంటారు. ప్యాకేజీతో పర్యాటకులు స్వామివారి దర్శనంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే దర్శన టికెట్లతో నేరుగా స్వామివారి శీఘ్రదర్శనం అవుతుంది. అయితే టీటీడీ పాలక మండలి రద్దు నిర్ణయంతో భక్తులు ఇబ్బందులు పడనున్నారు. ప్యాకేజీ సమయం అంతా తిరుపతిలోనే గడిచిపోతుంటుంది. దీంతో పర్యాటకులు ఆసక్తి చూపరు. దీంతో ట్రావెల్స్ రంగంపై ఆధారపడే వారందరికీ ఉపాధి కరువవుతుంది. నిత్యం వెయ్యిమందికిపైగా తిరుపతికి జర్నీ చేస్తారు. టీటీడీ బోర్డు త్వరగా నిర్ణయం తీసుకొని దర్శనానికి అనుమతి ఇవ్వాలి.

Advertisement

Next Story