AP News:విద్యుత్‌ ఛార్జీలతో సతమతమవుతున్న ప్రజలకు BIG షాక్!

by Jakkula Mamatha |
AP News:విద్యుత్‌ ఛార్జీలతో సతమతమవుతున్న ప్రజలకు BIG షాక్!
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: విద్యుత్‌ ఛార్జీలతో సతమతమవుతున్న వినియోగదారులపై డిస్కంలు మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ట్రూఅప్‌తో పాటు ఎఫ్‌పీపీసీఏ చార్జీలతో నడ్డివిరుస్తున్న విద్యుత్‌ సంస్థలకు ఆ మేరకు విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి ఇచ్చేసింది. పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించకుండానే ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని చడీచప్పుడు లేకుండా ఈఆర్‌సీ కార్యదర్శి పి.కృష్ణ ఉత్తర్వులు విడుదల చేశారు.

బహిరంగ విచారణ లేకుండానే..

2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.12,844 కోట్లు ఎఫ్‌పీపీసీఏ కింద వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఈఆర్‌సీకి డిస్కంలు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 19లోపు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పంపాలని ఇఆర్‌సి ఈ నెల 4న బహిరంగ ప్రకటన విడుదల చేసింది. వేల కోట్లకు సంబంధించిన భారంపై కనీసం బహిరంగ విచారణ జరపకుండా రూ.9,412 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story