Sustain Kart: కాంతి దత్ మోసాలు.. జూబ్లీహిల్స్ లో కేసు నమోదు.. బాధితుల్లో స్టార్ హీరోయిన్లు

by Rani Yarlagadda |
Sustain Kart: కాంతి దత్ మోసాలు.. జూబ్లీహిల్స్ లో కేసు నమోదు.. బాధితుల్లో స్టార్ హీరోయిన్లు
X

దిశ, వెబ్ డెస్క్: సెలబ్రిటీలు, వ్యాపరవేత్తలే లక్ష్యంగా ఓ జ్యూవెలరీ వ్యాపారవేత్త మోసాలకు పాల్పడ్డాడు. తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్(Kanti Dutt).. సస్టెయిన్ కార్ట్ (Sustain Kart) పేరుతో మోసాలకు తెరతీశాడు. పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించి.. డబ్బున్న వారికి ఎర వేశాడు. అతడిని నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. శ్రీజరెడ్డి అనే మహిళ మోసపోయానని గ్రహించి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగుచూసింది.

హీరోయిన్లు, వ్యాపారవేత్తల నుంచి సుమారు రూ.100 కోట్లు దోచుకున్నట్లు సమాచారం. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి వంటి స్టార్లు కూడా ఉండటం గమనార్హం. సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. సీసీఎస్ లో కూడా అతనిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా.. సస్టెయిన్ కార్ట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటికి వచ్చానని నెలరోజుల క్రితం శిల్పారెడ్డి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. "వాళ్ల వ్యాపార పద్ధతులు నా నైతికత మరియు సూత్రాలకు అనుగుణంగా లేవు. ఆ సంస్థతో నాకు ఇంకేమీ సంబంధం లేదు. ఇతర సహ-వ్యవస్థాపకుడు మిస్టర్ కాంతి దత్‌తో నాకు వృత్తిపరమైన లేదా వ్యక్తిగత సంబంధం లేదు" అని ఆమె పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed